ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నైజామ్ లో 'సెల్ఫీ రాజా' దూకుడు

Mon, Jul 18, 2016
'సెల్ఫీ రాజా'లో ఓ దృశ్యం
'సెల్ఫీ రాజా'లో ఓ దృశ్యం
అల్లరి నరేష్ కి మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుంది. ఆయన సినిమాల్లో కావలసినంత కామెడీ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ కి వుంది. అలా ఆయన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతూ 'సెల్ఫీ రాజా'ని వాళ్ల ముందుకు తీసుకొచ్చాడు. ఈ నెల 15వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ముఖ్యంగా ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా మూడు రోజుల్లో 1.3 కోట్ల రూపాయలను రాబట్టిందని చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ .. మహేష్ మూవీస్ లోని సీన్స్ తోపాటు, బాహుబలి .. నాన్నకు ప్రేమతో .. సరైనోడు ... బెంగాల్ టైగర్ స్పూఫ్ లను చేసి, అల్లరి నరేష్ కడుపుబ్బా నవ్వించాడని చెబుతున్నారు. వీటికి ఒక రేంజ్ లో విజిల్స్ పడుతున్నాయని అంటున్నారు. ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సాక్షి చౌదరి - కామ్నా రనావత్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)