ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ మూవీలో నదియా

Mon, Jul 18, 2016
నదియా
నదియా
ఒకప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా వెలుగొందిన నదియా, రీ ఎంట్రీ లోను దూసుకుపోతోంది. తెలుగులో ఆమె ముఖ్యమైన పాత్రలను పోషించిన మిర్చి .. అత్తారింటికి దారేది .. అ ఆ సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడంతో, ఆమె డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మధ్య వయసు మహిళకి సంబంధించిన కీలకమైన రోల్ ఒకటి ఉందంటే చాలు, దర్శక నిర్మాతలు ముందుగా నదియాను సంప్రదిస్తున్నారు.

అలా తాజాగా ఆమె మహేశ్ మూవీలోనూ ఎంపికైందనే వార్తలు వస్తున్నాయి. మహేశ్ తదుపరి చిత్రం మురుగదాస్ తో వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ గా చేస్తున్నాడు. ఆయన భార్యగా నదియా కనిపించనుందని అంటున్నారు. రకుల్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమా, ఈ నెల 29న సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)