ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ కోసం రంగంలోకి మరో రైటర్!

Mon, Jul 18, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి 150వ సినిమాకి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ .. ఆకుల శివ రచయితలుగా పనిచేసినట్టుగా తెలుస్తోంది. ఇక తాజాగా సాయిమాధవ్ బుర్రా కూడా రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఎమోషన్ సీన్స్ ను ఆయనకి చిరంజీవి అప్పగించాడట. ఆ సీన్స్ ను ఆయన బాగా రాయడంతో, మరి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు రాయమని ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.

గతంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా చేసిన 'గోపాల గోపాల' సినిమాకి సంభాషణల రచయితగా సాయిమాధవ్ బుర్రా పనిచేసాడు. ఆ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇప్పుడు ఇలా చిరంజీవి సినిమాకి పనిచేసే ఛాన్స్ ఆయనకి లక్కీగా వచ్చింది. ఈ సినిమాలోనూ ఆయన తన సత్తా చాటుతాడేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)