ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జవాన్'గా సాయిధరమ్ తేజ్

Mon, Jul 18, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
ఒక వైపున 'తిక్క' సినిమా షూటింగు ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే, మరోవైపున తన తదుపరి సినిమాకి సాయిధరమ్ తేజ్ రెడీ అవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో కథానాయకుడు సోల్జర్ గా కనిపిస్తాడు కనుక, 'సోల్జర్' అనే టైటిల్ ను .. 'జవాన్' అనే టైటిల్ ను పరిశీలించారు. యూనిట్ సభ్యులంతా 'జవాన్' టైటిల్ దిశగా మొగ్గు చూపడంతో, ఈ టైటిల్ నే ఖరారు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ .. హెబ్బా పటేల్ పేర్లు వినిపిస్తున్నాయి. ఆగస్టు 13న 'తిక్క' రిలీజ్ అవుతుంది. ఆ వెంటనే గోపీచంద్ మలినేనితో కలిసి సాయిధరమ్ తేజ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)