ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కబాలి' అందరికీ నచ్చుతాడట!

Mon, Jul 18, 2016
రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన 'కబాలి' చిత్రం, ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి దర్శకుడు రంజిత్ మాట్లాడాడు. ఈ సినిమాలో 'కబాలి' తోటి కార్మికుల కోసం పోరాడే ఒక యువకుడిగా కనిపిస్తాడని అన్నాడు. అలాగే వయసు మళ్లిన తరువాత గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని చెప్పాడు.

ఇంతవరకూ రజనీకాంత్ పోషించిన పాత్రలలో, ఇది మరింత వైవిధ్యభరితమైందిగా అనిపిస్తుందని అన్నాడు. ఆనందం .. ఆవేదన .. బాధ .. భావోద్వేగాలతో రజనీ పాత్ర కొనసాగుతుందని చెప్పాడు. పాటలు కూడా బాగా వచ్చాయనీ .. సందర్భానుసారంగా అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నాడు. ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)