ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Mon, Jul 18, 2016
శ్రద్దా దాస్
శ్రద్దా దాస్
* ఒక ఛాలెంజింగ్ పాత్ర కోసం తాను ఎదురుచూస్తున్నానని అంటోంది కథానాయిక శ్రద్ధా దాస్. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేశానని, ఈసారి సీరియస్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నానని, అలాంటి అవకాశం వస్తే ఛాలెంజ్ గా తీసుకుని చేస్తానని చెప్పింది. ఇటీవల ఈ చిన్నది 'గుంటూరు టాకీస్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
* నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతోంది. అక్కడి నటరాజ్ థియేటర్ లో మహేశ్ బాబు నటించిన 'దూకుడు' చిత్రాన్ని హీరో నాని చూడడాన్ని షూటింగులో భాగంగా తాజాగా చిత్రీకరించారు.
* తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'పెళ్లిచూపులు' చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రీతువర్మ, నందు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డి.సురేశ్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
* సందీప్ కిషన్, నిత్యా మీనన్ జంటగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన రచయిత రాజసింహ తాడినాడ తన తదుపరి చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో ఓ కొత్త హీరో నటిస్తాడని ఆయన తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.205.89.199
Movie News (Latest)