ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్య తన సత్తా చూపుతున్నాడు

Sun, Jul 17, 2016
సూర్య
సూర్య
కోలీవుడ్లో వరుసగా విభిన్న కథా చిత్రాలు చేసే కథానాయకుడిగా సూర్యకి మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆయన 'సింగం 3' సినిమా షూటింగుతో బిజీగా వున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పార్ట్ ను పూర్తిచేసుకోనుంది. ఒక వైపున ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగానే, మరోవైపున ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది.

ఈ సినిమా తమిళ వెర్షన్ కి సంబంధించిన హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒకరు 41 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన హక్కులు 18 కోట్లకి అమ్ముడైనట్టుగా చెబుతున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఈ స్థాయి రేటు పలకడం, సూర్య కెరియర్లో ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. సింగం సీక్వెల్ గా వున్న క్రేజ్ .. ఇటీవల వచ్చిన '24' సినిమా చూపిన ప్రభావం ఈ స్థాయి రేటు పలకడానికి కారణమని చెప్పుకుంటున్నారు. దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)