ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ధ్రువ' ఫస్టులుక్ రిలీజ్ ఆ రోజునే!

Sun, Jul 17, 2016
చరణ్
చరణ్
చరణ్ తాజా చిత్రం 'ధ్రువ' పట్ల అభిమానులంతా ఆసక్తిగా వున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ ను ఆగస్టు 15న రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు. అలాగే సెప్టెంబర్ లో ఆడియోను విడుదల చేయనున్నారు.

ఈ సినిమాకి హిపాప్ తమిజా సంగీతాన్ని సమకూర్చిన సంగతి తెలిసిందే. పాటలన్నీ కూడా చాలా బాగా వచ్చాయని అంటున్నారు. కథ చాలా ఆసక్తికరంగా .. ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది కనుక, కథ వేగానికి పాటలు అడ్డు కాకుండా సందర్భానుసారం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. చరణ్ కొత్త లుక్ తో కనిపించనుండటం .. అరవింద్ స్వామి విలన్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలిచే అంశాలుగా కనిపిస్తున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)