ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్'లో సెట్ సాంగ్ హైలైట్!

Sun, Jul 17, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్,  సమంత
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్, సమంత
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న 'జనతా గ్యారేజ్' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ వుంది. ఇందులో ఒక పాటను త్వరలో కేరళ అందాల నడుమ చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే మరో పాటను సెట్స్ లో షూట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక, ఈ సెట్ సాంగును భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం దర్శకుడు కొరటాల సూచనల మేర సెట్ ను వెరైటీగా డిజైన్ చేసి, భారీ ఖర్చుతో హైదరాబాదు స్టూడియోలో ఎరెక్ట్ చేస్తున్నారు. ఈ సెట్ జార్జియస్ గా ఉంటుందని, పాట చాలా లావిష్ గా కనిపిస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఈ పాటలో కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. వెరసి ఈ సెట్ సాంగ్ చిత్రానికే హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)