ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కిషోర్ తిరుమలకే వెంకీ ఛాన్స్!

Sat, Jul 16, 2016
వెంకటేశ్
వెంకటేశ్
వెంకటేశ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' సినిమా రూపొందింది. ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 24న ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 12న సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తారు. ఆ తరువాత రెండు .. మూడు ప్రాజెక్టులు వెంకీ కోసం సిద్ధంగా వున్నాయనే వార్తలు షికారు చేయడంతో, ముందుగా ఆయన ఎవరి దర్శకత్వంలో చేస్తాడా అనే ఆసక్తి అభిమానుల్లో కలిగింది.

ముందుగా ఆయన కిషోర్ తిరుమలతో సెట్స్ పైకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడనేది తాజా సమాచారం. 'నేను శైలజ' హిట్ తో కిషోర్ తిరుమల దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. ఇప్పుడు కథ వినిపించిన వెంటనే వెంకీతో ఓకే చెప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)