ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూకి విలన్ గా జగపతిబాబు?

Sat, Jul 16, 2016
జగపతిబాబు
జగపతిబాబు
చిరంజీవి 150వ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి అవకాశం లభిస్తుందా .. విలన్ గా ఎవరికి ఛాన్స్ దక్కుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ నటుడిని విలన్ గా తీసుకోవాలని మొదట్లో ఈ సినిమా టీమ్ నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఆ నటుడిని సంప్రదించారు కూడా.

అయితే ఆ నటుడు చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినట్టు సమాచారం. దాంతో విలన్ పాత్ర కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. అయితే విలన్ గా జగపతిబాబుని మించిన సంతృప్తిని కలిగించే నటుడు కనిపించకపోవడంతో, ఆయననే తీసుకుందామనే ఆలోచనలో వినాయక్ వున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల దశలో ఉందనీ, త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం వుందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)