ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మనసు మార్చుకున్న అఖిల్

Sat, Jul 16, 2016
అఖిల్
అఖిల్
అఖిల్ తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య తో పాటు ఈ డిసెంబర్ లోనే అఖిల్ పెళ్లి కూడా జరగవచ్చని వార్తలు షికారు చేశాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని అఖిల్ చెప్పాడు.

తన స్నేహితురాలైన శ్రేయా భూపాల్ ను చాలా కాలంగా ఇష్టపడుతోన్న మాట వాస్తవమేనని ఆయన అన్నాడు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం లేదని చెప్పాడు. కెరియర్ ఆరంభంలో పెళ్లి ఆలోచన చేయడం కరెక్ట్ కాదని స్నేహితులు .. కుటుంబ సభ్యులు చెప్పడం వల్లనే అఖిల్ మనసు మార్చుకున్నాడని అంటున్నారు. అయితే ఈ లోగా శ్రేయ భూపాల్ తో ఎంగేజ్ మెంట్ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)