ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ముందుగానే రానున్న 'మనమంతా'

Sat, Jul 16, 2016
మోహన్ లాల్
మోహన్ లాల్
మోహన్ లాల్ .. గౌతమి ప్రధాన పాత్రలుగా 'మనమంతా' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది. ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ అదే రోజున 'బాబు బంగారం' .. 'తిక్క' సినిమాలు రిలీజ్ లు పెట్టుకున్నాయి.

దాంతో ఒక వారం ముందుగానే .. అంటే ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. నలుగురు వ్యక్తుల జీవితంలో చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. దర్శకుడిగా చంద్రశేఖర్ కి మంచి గుర్తింపు ఉంది. ఇక వారాహి బ్యానర్ కి కూడా కథాబలమున్న చిత్రాలను అందిస్తుందనే పేరుంది. ఈ కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)