ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'శాతకర్ణి'కి డిజైనర్ గా నీతా లుల్లా

Sat, Jul 16, 2016
నీతా లుల్లా
నీతా లుల్లా
చారిత్రక చిత్రాలకు కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేయడం అంత తేలికైన విషయం కాదు. సంబంధిత కాలానికి చెందిన సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేసి, వేషధారణపై ఒక అవగాహనకి రావలసి ఉంటుంది. అలా గతంలో 'జోధా అక్బర్' సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన 'నీతా లుల్లా' .. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.

శాతవాహనుల కాలం నాటి సంస్కృతీ సంప్రదాయాలపై పరిశోధన చేసిన అనంతరమే ఆమె ఈ కాస్ట్యూమ్స్ సిద్ధం చేసిందట. ఇండియాలోని బెస్ట్ జ్యుయల్ మేకర్స్ తో ఆభరణాల డిజైన్స్ గీయించి .. వాటిని తయారు చేయిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ .. శ్రియ .. హేమమాలిని వంటి ప్రధాన పాత్రల లుక్ పై ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఆమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)