ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దూకుడు చూపిస్తోన్న హీరోయిన్

Sat, Jul 16, 2016
అనూ ఇమాన్యుయెల్
అనూ ఇమాన్యుయెల్
తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న కొత్త కథానాయికలలో అనూ ఇమాన్యుయెల్ ఒకరు. గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఆక్సిజన్' చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నాని తాజా చిత్రంలోను ఆమె ఛాన్స్ కొట్టేసింది. రాజ్ తరుణ్ సినిమా కోసం కూడా ఆమె ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది.

'దొంగాట' సినిమాతో దర్శకుడిగా వంశీకృష్ణ మంచి మార్కులు కొట్టేశాడు. ఆయన దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమాన్యుయెల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. వైవిధ్యభరితమైన కథ .. తన పాత్ర నచ్చడంతో వెంటనే ఆమె ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే, ఆమె ఇలా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనదైన దూకుడు చూపిస్తూ ఉండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.147.236.192
Movie News (Latest)