ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందుకే ఆలస్యమన్న కొరటాల

Sat, Jul 16, 2016
కొరటాల శివ
కొరటాల శివ
కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఆగస్టు 12న విడుదల చేయనున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఈ సినిమాను సెప్టెంబర్ 2కి వాయిదా వేసుకున్నట్టుగా నిన్న వార్తలు షికారు చేయడంతో, అభిమానులు నిరుత్సాహానికి లోనయ్యారు. దాంతో కొరటాల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు.

ఒక మంచి సినిమాను ఇవ్వాలనుకునే ప్రయత్నంలో భాగంగా, విడుదల తేదీని పొడిగించుకోవలసి వచ్చిందని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంగారుగా పూర్తి చేయడం వలన ఆశించిన ఫలితం రాకపోవచ్చనీ, అందువలన మరికొంత సమయం తీసుకోవలసి వచ్చిందని అన్నారు. అభిమానులు ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఉండాలనే ఉద్దేశమే ఈ ఆలస్యానికి కారణమనీ, నిరాశను కలిగించినందుకు సారీ అని చెప్పారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)