ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికా నుంచి వచ్చేస్తున్న రజనీ!

Sat, Jul 16, 2016
'కబాలి' లో రజనీ కాంత్
'కబాలి' లో రజనీ కాంత్
శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' చిత్రానికి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ను పూర్తిచేసిన తరువాత, ఫ్యామిలీతో కలిసి రజనీకాంత్ అమెరికా వెళ్లారు. అక్కడే ఆయన అనారోగ్యానికి గురైనట్టుగా వార్తలు వినిపించాయి. ఆయన తాజాగా పూర్తిచేసిన 'కబాలి' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయినా అమెరికా నుంచి రజనీ రానున్న సమాచారమేమీ లేకపోవడంతో, ఆయన ఆరోగ్యం గురించిన పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఆగస్టులో మొదలుకానున్న 'రోబో 2.0' తాజా షెడ్యూల్లో రజనీ పాల్గొంటారని ఈ సినిమా టీమ్ చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న రజనీ ఇండియాకి తిరిగి వస్తున్నట్టుగా తెలుస్తోంది. 'కబాలి' రిలీజ్ కోసం .. రజనీ రాక కోసం ఆతృతగా ఎదురుచూస్తోన్న అభిమానులకి ఇది కచ్చితంగా శుభవార్తే!
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)