ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మాట' కష్టమంటున్న ముద్దుగుమ్మ!

Sat, Jul 16, 2016
కృతి కర్బంద
కృతి కర్బంద
'అబ్బో... డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమండీ బాబూ' అంటోంది అందాలతార కృతి కర్బంద. ఈ చిన్నది తొలిసారిగా ఓ హిందీ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇమ్రాన్ హష్మీ కథానాయకుడుగా నటించిన 'రాజ్ రీబూట్' చిత్రం ద్వారా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి పరిచయమవుతోంది. ఆమెకిది తొలి హిందీ చిత్రం కావడం ఒక విశేషం అయితే, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరో విశేషం. ఇంతవరకు తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలలో నటించినప్పటికీ కృతి ఇంతవరకు తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ హిందీ చిత్రానికి డబ్బింగ్ చెప్పుకోవడంతో, ఆమె చాలా ఎగ్జయిటింగ్ గా వుంది.

"కెమెరా ముందు నిలబడి నటించడం కంటే, మైక్ ముందు నిలబడి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. నటించేటప్పుడు ఒక ఫ్లోలో వెళ్లిపోతాం. డబ్బింగ్ విషయంలో అలా కాదు. చిన్న చిన్న భావాలకు కూడా చాలా జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పవలసి వుంటుంది. అభినయానికి మన డబ్బింగ్ కరెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఏమైనా, ఈ ప్రక్రియ మాత్రం చాలా కష్టమైనదే" అని చెప్పింది కృతి. ఈ హిందీ సినిమాపై అమ్మడు చాలా హోప్స్ పెట్టుకుంది. మరి, అక్కడనైనా బిజీ అవుతుందేమో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)