ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వాళ్లకి బన్నీ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెబుతాడట!

Sat, Jul 16, 2016
'యోధవు' పోస్టర్
'యోధవు' పోస్టర్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి మార్కెట్ వుంది. ఒకవిధంగా చెప్పాలంటే, ఇతర తెలుగు హీరోలకు ఎవరికీ లేని విధంగా అక్కడ మార్కెట్ సంపాదించుకున్నాడు. దాంతో బన్నీ నటించే చిత్రాలన్నీ మలయాళంలోకి అనువాదమవడం ... అక్కడ కూడా మంచి విజయాలను నమోదు చేయడం జరుగుతోంది. ఈ క్రమంలో ఇటీవల తాను నటించిన 'సరైనోడు' బ్లాక్ బస్టర్ మూవీని 'యోధవు' పేరిట మలయాళంలోకి డబ్ చేసి వదిలారు. ఇది అక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. ఈ మలయాళం వెర్షన్ 24 థియేటర్లలో ఏభై రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తన మలయాళ అభిమానులకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పడానికి బన్నీ రెడీ అవుతున్నాడు. త్వరలోనే స్వయంగా వారిని కలసి తన ఆనందాన్ని పంచుకుంటాడట!
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)