ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sat, Jul 16, 2016
సమంతా
సమంతా
* 'జనతా గ్యారేజ్' చిత్రం షూటింగును పూర్తిచేసిన చెన్నయ్ బ్యూటీ సమంతా ప్రస్తుతం హాలిడే ఎంజాయ్ చేస్తోంది. తన తల్లిదండ్రులతో కలసి టూర్లు వేస్తోంది. త్వరలోనే వివాహానికి రెడీ అవుతున్న ఈ చిన్నది తెలుగు, తమిళ భాషల్లో ప్రస్తుతం కొత్తగా ఏ సినిమాలను ఒప్పుకోవడం లేదు.
* ఇటీవల 'ఆ.. ఆ' చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి జరుగుతుందని, వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత కె.కె.రాధామోహన్ తెలిపారు.
* జాకీ అతీక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి' చిత్రం మోషన్ పోస్టర్ ను నిన్న సాయంకాలం విడుదల చేశారు. ఈ సినిమాలో నరేశ్, నాగబాబు, ఆమని, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు.
* నవీన్ చంద్ర హీరోగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం షూటింగ్ ఈ నెల 18 నుంచి జరుగుతుంది. ఇందులో నటించే కథానాయిక ఎంపిక ప్రస్తుతం జరుగుతోందని దర్శకుడు తెలిపారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)