ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సాయిధరమ్ తేజ్ తో హెబ్బా పటేల్!

Fri, Jul 15, 2016
హెబ్బా పటేల్
హెబ్బా పటేల్
హెబ్బా పటేల్ కి యూత్ లో ఎంతో క్రేజ్ ఉంది. అందువలన ఆమె వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతోంది. ఈ క్రమంలో ఆమె సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రంలోను అవకాశాన్ని దక్కించుకుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న ఈ సినిమా, త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయికగా నిన్నమొన్నటి వరకూ రకుల్ పేరు షికారు చేసింది. తాజాగా హెబ్బా పటేల్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

అయితే రకుల్ కి బదులుగా హెబ్బాను తీసుకున్నారా? లేదంటే రెండవ కథానాయికగా ఎంపిక చేశారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ జోడీగా 'మిస్టర్' మూవీలో హెబ్బా పటేల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఒకే సమయంలో ఇద్దరు మెగా హీరోలతో హెబ్బా పటేల్ జట్టు కట్టడం నిజంగా విశేషమే.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)