ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఒక్క పైసా తీసుకోలేదన్న జగపతిబాబు

Fri, Jul 15, 2016
జగపతిబాబు
జగపతిబాబు
ఒకప్పుడు జగపతిబాబు మొహమాటానికిపోయి ఆర్ధికంగా చాలా నష్టపోయారు. తన నుంచి సాయాన్ని పొందినవారు, ఆ తరువాత తనని పట్టించుకోకపోవడం ఆయనకి చాలా బాధ కలిగించింది. అప్పటి నుంచి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నానని ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటి జగపతిబాబు .. ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసి డబ్బు తీసుకోకపోవడం విశేషం.

హాలీవుడ్ మూవీ 'ది బిఎఫ్ జి' .. ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి గాను జగపతిబాబు ఒక పాత్రకి డబ్బింగ్ చెప్పారు. అయితే ఇలా డబ్బింగ్ చెప్పినందుకుగాను పారితోషికంగా తాను ఒక్క పైసా తీసుకోలేదని ఆయన అన్నారు. ఈ సినిమా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ అంటే తనకి ఎంతో అభిమానమనీ, ఆయనతో ఒక ఫోటో దిగితే అదే తనకి భారీ పారితోషికంగా భావిస్తానని చెప్పారు. ఈ సినిమాలో ఈ విధంగా తన భాగస్వామ్యం ఉన్నందుకు ఆనందంగా ఉందని అన్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)