ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'తిక్క' రిలీజ్ డేట్ ఫిక్స్

Fri, Jul 15, 2016
'తిక్క'లో సాయిధరమ్ తేజ్
'తిక్క'లో సాయిధరమ్ తేజ్
సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా 'తిక్క' సినిమా రూపొందింది. ఇటీవల లడక్ లో చిత్రీకరించిన పాటతో, ఈ సినిమా షూటింగును పూర్తిచేసుకుంది. రోహిణ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో లారిస్సా బొనేసి .. మన్నారా చోప్రా కథానాయికలుగా అలరించనున్నారు. ఈ మధ్య వచ్చిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతో ఈ నెల 20వ తేదీన ఫస్టు టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ నెల 30వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. వచ్చే నెల 13న ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారా సాయిధరమ్ తేజ్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)