ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'కత్తిలాంటోడు' ఖరారు కాలేదట!

Fri, Jul 15, 2016
చరణ్
చరణ్
చిరంజీవి 150వ సినిమా .. తమిళంలో వచ్చిన 'కత్తి' సినిమాకి రీమేక్ అనే విషయం తెలిసిందే. అదే టైటిల్ తో ఆల్రెడీ తెలుగులో ఒక సినిమా ఉండటంతో, ఈ సినిమాకి 'కత్తిలాంటోడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇదే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వెళుతున్నాయి.

అయితే ఇదంతా ప్రచారం మాత్రమేననీ .. టైటిల్ ను ఇంకా ఖరారు చేయలేదని చరణ్ చెప్పాడు. అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న ఆయన, ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. టైటిల్ ఏంటనేది త్వరలోనే ప్రకటిస్తామనీ .. షూటింగ్ చాలా బాగా జరుగుతోందని అన్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఏ టైటిల్ పెట్టనున్నారనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించడం ఖాయమని చెప్పొచ్చు. చరణ్ నిర్మాణంలో .. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)