ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బోయపాటి చెప్పిన క్లయిమాక్స్ ట్విస్ట్!

Fri, Jul 15, 2016
బోయపాటి శ్రీను
బోయపాటి శ్రీను
సాధారణంగా కొంతమంది దర్శకులు సినిమా కథను మొదటి నుంచి క్లైమాక్స్ వరకూ రాసుకుంటారు. అవసరమైతే క్లైమాక్స్ దృశ్యాలను మధ్యలోనే చిత్రీకరిస్తుంటారు. ఇందుకు భిన్నంగా బోయపాటి స్టైల్ ఉంటుంది. ఆయన క్లైమాక్స్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. అలాంటి బోయపాటి శ్రీను ముందుగా కథలో క్లైమాక్స్ రాసుకోడట.

సినిమాలో కొంత భాగాన్ని చిత్రీకరించాక, అప్పుడు క్లైమాక్స్ ను రాసుకుంటానని ఆయనే స్వయంగా చెప్పాడు. ఏ సినిమాకైనా .. తాను చిత్రీకరించిన మిగతా సన్నివేశాలను ఫైనల్ గా ఒకసారి చూసుకుంటాననీ, వచ్చిన అవుట్ ఫుట్ ను బట్టి క్లైమాక్స్ మోతాదు ఎంత ఉండాలనేది అర్థం చేసుకుంటానని అన్నాడు. దానిని బట్టే క్లైమాక్స్ దృశ్యాలను ప్లాన్ చేసుకుంటానని చెప్పాడు. మొదటి నుంచి కూడా ఈ విధంగా చేయడమే తనకి అలవాటనీ, అదే తనకి కలిసొచ్చిందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)