ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' వాయిదా పడనుందా?

Fri, Jul 15, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమా వాయిదా పడనుందా? అనే ప్రశ్నకి .. అందుకు అవకాశం ఎక్కువగా ఉందనే సమాధానం వినిపిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా, టాకీ పార్టును పూర్తిచేసుకుంది. ఇక రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ పాటలకి సంబంధించిన షూటింగ్ కి పది రోజుల వరకూ పడుతుందనీ, మిగతా సమయంలో ఈ సినిమా అన్ని పనులను పూర్తి చేసుకోవడం కష్టమేనని అనుకుంటున్నారు.

అందువలన ముందుగా చెప్పిన ప్రకారం ఈ సినిమా ఆగస్టు 12న రాకపోవచ్చనీ, సెప్టెంబర్ 2న విడుదల చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావొచ్చని అంటున్నారు. దర్శకుడు కొరటాల .. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ .. ఎన్టీఆర్ .. సమంతా .. నిత్యామీనన్ .. ఇలా ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్లంతా సక్సెస్ లతో వున్నవారే. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)