ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అభిమానులకు చరణ్ 'మెగా' ఆఫర్!

Fri, Jul 15, 2016
చిరంజీవి
చిరంజీవి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిమానులకు ఓ పెద్ద ఆఫర్ ఇచ్చాడు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవిని కలుసుకునే అవకాశాన్ని అభిమానులకు ఆయన కల్పిస్తున్నారు. 'స్వచ్ఛ భారత్' వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేబట్టే అభిమానులకు ఆయన ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీని కోసం ఫాన్స్ ఏం చేయాలంటే, తమ తమ ప్రాంతాలలో అభిమానులు నిర్వహించే సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను చరణ్ ఫేస్ బుక్ అకౌంటులో పోస్ట్ చేయాలి. అలా వచ్చిన వాటి నుంచి ఘనమైన సేవా కార్యక్రమాలను చేబట్టిన అభిమానులను ఎంపిక చేసి, చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం సెట్స్ కు వారిని ఆహ్వానించి, మెగాస్టార్ ను కలుసుకునే ఏర్పాటు చేస్తారు. అలాగే, ఆయా అభిమానులను సత్కరించడం కూడా జరుగుతుందని చరణ్ పేర్కొన్నాడు. నిన్న సాయంకాలం తన అభిమానులతో తొలిసారిగా ఫేస్ బుక్ ద్వారా లైవ్ ఛాట్ చేసిన సందర్భంగా రామ్ చరణ్ 'మెగా' అభిమానులకు ఈ ఆఫర్ ఇచ్చాడు. మరిక, అభిమానులు రంగంలోకి దూకడమే ఆలస్యం!
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)