ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రకుల్ గురించి మురుగదాస్ ట్వీట్!

Thu, Jul 14, 2016
రకుల్
రకుల్
మహేశ్ కథానాయకుడిగా దర్శకుడు మురుగదాస్ ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో వున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో, కథానాయికగా నిన్నమొన్నటి వరకూ పరిణీతి చోప్రా పేరు వినిపించింది. ఆమెను తీసుకోవడం వలన కొత్తగా సినిమాకి చేకూరే లాభం ఏమీ లేదని భావించిన ఈ సినిమా టీమ్, రకుల్ ను సంప్రదిస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి.

పాత్రకి సంబంధించిన లుక్ తో రకుల్ కి టెస్ట్ కట్ కూడా చేశారనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెనే కథానాయికగా ఎంపిక చేసినట్టుగా కొంతసేపటి క్రితం మురుగదాస్ ట్వీట్ చేశాడు. ఠాగూర్ మధు - ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాకి, హారీస్ జైరాజ్ - సంతోష్ శివన్ వంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ఇంతటి భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన రకుల్ నిజంగా అదృష్టవంతురాలే!
X

Feedback Form

Your IP address: 54.159.239.251
Movie News (Latest)