ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రామ్ కూడా దసరాకే ప్లాన్ చేశాడు

Thu, Jul 14, 2016
రామ్
రామ్
రామ్ కథానాయకుడిగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'హైపర్' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది. రామ్ జోడీగా ఈ సినిమాలో రాశి ఖన్నా నటిస్తోంది. ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందు ఉండేలా రామ్ ప్లాన్ చేశాడని చెబుతున్నారు.

సెప్టెంబర్ 30న ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి రామ్ వచ్చాడని అంటున్నారు. చరణ్ ముందుగా ఇదే రోజున తన 'ధ్రువ' సినిమాను విడుదల చేయాలని అనుకున్నాడు. ఆ తరువాత ఆయన అక్టోబర్ 7వ తేదీకి వెళ్లాడు. ఈ కారణంగా చరణ్ కంటే ఒక వారం రోజుల ముందుగానే రామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్న మాట. ఇంకా దసరా దిశగా ఏయే సినిమాలు కదులుతాయో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)