ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మలేసియాకి సూర్య మూవీ!

Thu, Jul 14, 2016
సూర్య
సూర్య
సాధ్యమైనంత త్వరగా 'సింగం 3' సినిమా షూటింగును పూర్తిచేసే పనిలో సూర్య వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. సూర్య .. శ్రుతిహాసన్ కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య భార్యగా అనుష్క నటిస్తుండగా, శ్రుతిహాసన్ జర్నలిస్టుగా కనిపించనుంది.

మరో రెండు రోజుల్లో ఈ సినిమా టీమ్ వైజాగ్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుని చెన్నై వెళ్లనుంది. ఈ నెల 18 నుంచి అక్కడ తాజా షెడ్యూల్ మొదలుకానుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. ఆ తరువాత చివరి షెడ్యూల్ ను మలేసియాలో ప్లాన్ చేశారు. ఆగస్టు 5 నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో సూర్య వున్నాడు. ఈ సినిమా తప్పకుండా తనకి హిట్ ఇస్తుందనే ఆశతో వున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)