ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Thu, Jul 14, 2016
ప్రగ్యా జైస్వాల్
ప్రగ్యా జైస్వాల్
* 'కంచె' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు మంచు మనోజ్ సరసన ఓ చిత్రంలో నటించనుంది. సత్య దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ న్యూ లుక్ లో కనిపిస్తుందట. హెయిర్ స్టయిల్ ను మార్చడంతో పాటు గ్లామరస్ కాస్ట్యూమ్స్ ధరిస్తుందని సమాచారం.
* హాస్యనటుడు ధనరాజ్, దీక్షాపంత్ హీరో హీరోయిన్లుగా నటించిన 'బంతిపూల జానకి' చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్ చేస్తారు.
* నిన్నటి తరం కథానాయిక సుహాసిని ఇప్పుడు నాటకరంగంపై మనసు పడింది. దీంతో తన దర్శకత్వంలో త్వరలో చెన్నయ్ లో ఒక నాటకాన్ని ప్రదర్శించడానికి ఆమె రెడీ అవుతోంది. ఈ నాటకానికి రచన కూడా తనే చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
* వెంకటేశ్, రానాలతో తాను మల్టీ స్టారర్ చేయనున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని దర్శకుడు రవికాంత్ పేరెపు వివరణ ఇచ్చాడు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, తన తదుపరి చిత్రం వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. 'క్షణం' సినిమాతో రవికాంత్ దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.205.140.252
Movie News (Latest)