ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కల్యాణ్ రామ్ కి కథ చెప్పిన శ్రీవాస్

Wed, Jul 13, 2016
శ్రీవాస్
శ్రీవాస్
దర్శకుడు శ్రీవాస్ పేరు చెప్పగానే లక్ష్యం .. లౌక్యం .. డిక్టేటర్ వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. యాక్షన్ .. ఎమోషన్ సీన్స్ ను తనదైన శైలిలో ఆవిష్కరిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. అలాంటి శ్రీవాస్ ఆ మధ్య గోపీచంద్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వినిపించాయి.

గోపీచంద్ తో ఆయన తెరకెక్కించిన లక్ష్యం .. లౌక్యం సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయి. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ రావడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో సంపత్ నంది ప్రాజెక్టు పట్లనే గోపీచంద్ ఆసక్తిని కనబరిచాడు. ఈ సినిమా పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది కనుక, కల్యాణ్ రామ్ ని కలిసి తాను సిద్ధం చేసిన కథను ఆయనకి శ్రీవాస్ వినిపించాడట. కథ విన్న కల్యాణ్ రామ్ నుంచి సమాధానం రావలసి ఉందని అంటున్నారు. మరి ఆయన ఓకే అంటాడో .. లేదో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)