ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కథలు వింటోన్న నిహారిక

Wed, Jul 13, 2016
నిహారిక
నిహారిక
గ్లామర్ తోను .. జోష్ తోను నిహారిక యూత్ లో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రేజ్ కారణంగానే ఆమె కథానాయికగా మారిపోయింది. 'ఒక మనసు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటన పరంగా ఆమె ఆడియన్స్ ను ఆకట్టుకుంది. అయితే పాత్ర పరంగా ఆమెలోని జోష్ ను చూసే అవకాశం లేకపోవడం అభిమానులకి కాస్తంత నిరాశను కలిగించింది.

దాంతో నిహారిక తన రెండో సినిమా ఎలా ఉంటే బాగుంటుందనే ఆలోచన చేస్తోందట. విభిన్నమైన కథలు విని వాటిలో ఒక మంచి కథను ఎంపిక చేసుకోవచ్చనే ఉద్దేశంతో, కథలు వింటోందని అంటున్నారు. కథను ఓకే చేసేసి .. అది సెట్స్ పైకి వెళ్లేలోగా మళ్లీ బుల్లి తెరపై సందడి చేసే ఆలోచనలో నిహారిక వుందని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)