ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ మూవీ నుంచి శ్రుతిహాసన్ తప్పుకుందా?

Wed, Jul 13, 2016
శ్రుతిహాసన్
శ్రుతిహాసన్
డాలి దర్శకత్వంలో పవన్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది. సెట్స్ పైకి వెళ్లడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి శ్రుతిహాసన్ తప్పుకుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం షూటింగ్ మొదలైవుంటే, శ్రుతిహాసన్ ఈ సినిమా చేసేదేనట.

అయితే దర్శకుడు మారినందువలన, ఈ సినిమా మొదలుకావడానికి ఆలస్యమవుతోంది. ఈ కారణంగా శ్రుతిహాసన్ డేట్స్ ఇప్పుడు లేవట. అవతల ఆమె వేరే సినిమాలను అంగీకరించి ఉంది. అందువలన ఈ సినిమా చేయలేనని చెప్పినట్టు వినికిడి. ఈ విషయంపై ఈ సినిమా టీమ్ తర్జన భర్జనలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. 'గబ్బర్ సింగ్' జోడీ మళ్లీ కనువిందు చేయనుందని అనుకున్న అభిమానులకు, ఇది నిరాశను కలిగించే విషయమే.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)