ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ మూవీలో విజయశాంతి?

Wed, Jul 13, 2016
విజయశాంతి
విజయశాంతి
చిరంజీవి 150వ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. రెండవ షెడ్యూల్ కి రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఈ సినిమాలో విజయశాంతి నటించనుందనేదే ఆ వార్త సారాంశం.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర వుందట. ఆ పాత్రను విజయశాంతి చేస్తే బాగుంటుందని భావించిన టీమ్ .. ఆమెను సంప్రదించినట్టు సమాచారం. తన పాత్రను గురించి తెలుసుకున్న విజయశాంతి, పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉందని అంటున్నారు. గతంలో చిరూ .. విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘనవిజయాలు అందుకున్నాయి. అందువలన ముఖ్యమైన పాత్రలో విజయశాంతి చేసినా, ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరగడం ఖాయమని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.142.219
Movie News (Latest)