ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సీక్వెల్ ఆలోచనలో నితిన్

Wed, Jul 13, 2016
నితిన్
నితిన్
నితిన్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'గుండెజారి గల్లంతయ్యిందే' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఆయనకి యూత్ లో మరింత క్రేజ్ పెంచింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో నితిన్ వున్నాడు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా, సీక్వెల్ కథను కూడా సిద్ధం చేసి నితిన్ కి వినిపించాడట.

అయితే ఫస్టాఫ్ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసిన నితిన్, సెకండాఫ్ మరింత బాగా వచ్చేలా చూడమని చెప్పాడని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. సెకండాఫ్ విషయంలో ఆయన త్వరగా నితిన్ ను మెప్పించగలిగితే, ఈ ఇద్దరూ సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. మరి సెకండాఫ్ సంతృప్తికరంగా వచ్చేవరకూ నితిన్ వెయిట్ చేస్తాడా? లేదంటే మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? అనేది చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)