ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

శ్రీకాంత్ అడ్డాల చిన్న సినిమా

Wed, Jul 13, 2016
శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల
చిత్రపరిశ్రమలో ఒక సినిమాను హిట్ చేస్తే నాలుగు అవకాశాలు వస్తాయి .. ఒక ఫ్లాప్ వస్తే అవకాశాలు ముఖం చాటేస్తాయి. అందువలన ఇక్కడ సక్సెస్ కోసమే అంతా కృషి చేస్తుంటారు. అయినా అప్పుడప్పుడు పరాజయాలు పలకరించడం మామూలే. అలా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా 'బ్రహ్మోత్సవం'తో ఒక పరాజయాన్ని అందుకున్నాడు. ఈ కారణంగా ఆయనకి వచ్చే అవకాశాలు ముఖం చాటేశాయి.

దాంతో ఆయనతో మరో సినిమా చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక చిన్న సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈసారి శ్రీకాంత్ అడ్డాల ఒక సింపుల్ లవ్ స్టోరీని ఎంచుకున్నాడట. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను ప్లాన్ చేశారని అంటున్నారు. గతంలో ఈ కాంబినేషన్ 'కొత్త బంగారు లోకం'తో హిట్ కొట్టింది. ఇప్పుడు అలాంటిదే రిపీట్ చేస్తారేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)