ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బన్నీ మళ్లీ తండ్రి కాబోతున్నాడు

Wed, Jul 13, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు అనే వార్త ఒకటి నిన్నంతా ఫిల్మ్ నగర్లో షికారు చేసింది. 'హరిత హారం' కార్యక్రమంలో బన్నీ దంపతులు పాల్గొన్నారు. ఆ సమయంలో బన్నీ భార్య స్నేహారెడ్డిని చూసిన వాళ్లంతా ఆమె ప్రెగ్నెంట్ అని గ్రహించారు. దాంతో బన్నీ మళ్లీ తండ్రి కాబోతున్నాడనే వార్త జోరుగా షికారు చేసింది.

ఈ వార్త నిజమేనని బన్నీ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. 2014లో బన్నీ దంపతులకు 'అయాన్' జన్మించాడు. అయాన్ ఎలా వున్నాడు .. ఎంతటి అల్లరి చేస్తున్నాడనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు బన్నీ తెలియజేస్తూనే ఉంటాడు. ఆయన మళ్లీ తండ్రి కాబోతున్నాడనే వార్త అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగించే విషయమే.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)