ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ బాబు ఆ మూవీ చేయడం లేదట!

Wed, Jul 13, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
తమిళంలోను .. తెలుగులోను ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి శ్రీ తేనాండాళ్ బ్యానర్ వారు రంగంలోకి దిగినట్టుగా కొన్ని రోజులుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ సినిమాకి సుందర్.సి దర్శకుడిగా వ్యవహరించనున్నాడనే టాక్ వినిపించింది.

300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను, తెలుగులో మహేశ్ తోను .. తమిళంలో విజయ్ తోను చేయాలనే ఆలోచనలో సుందర్.సి వున్నాడని చెప్పుకున్నారు. ఆ కథానాయకులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నాడని అనుకున్నారు. అయితే ఈ సినిమా చేయడానికి మహేశ్ ఆసక్తిని చూపలేదనేది తాజా సమాచారం. మురుగదాస్ సినిమా తరువాత తెలుగులో వరుసగా అగ్రదర్శకులతో మహేశ్ కి సినిమాలు వున్నాయి. అందువలన డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని భావించే ఆయన ఈ భారీ సినిమాకి నో చెప్పేశాడని అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)