ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ కల్యాణ్ తాజా చిత్రం అప్ డేట్స్!

Wed, Jul 13, 2016
పవన్
పవన్
పవన్ కల్యాణ్ నటించే తాజా చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో ఈ ప్రాజక్టులో 'గోపాల గోపాల' ఫేం డాలీ వచ్చి చేరిన సంగతి విదితమే. దీంతో కథ మొత్తం మారిపోయింది. మళ్లీ ఫ్రెష్ గా స్క్రిప్టు వర్క్ మొదలెట్టారు.
తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు డాలీ స్క్రిప్టు పనిని దాదాపు పూర్తి చేశాడట. పవన్ విని ఓకే చెబితే, ఇక సెట్స్ కు వెళుతుందని అంటున్నారు. అలాగే, కథానాయిక, ఇతర నటీనటుల ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంచితే, ఇటీవల లండన్ లో 'యుక్తా' వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్ హైదరాబాదుకి తిరిగివచ్చారు. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా షూటింగులో ఆయన పాల్గొంటారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)