ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్?

Wed, Jul 13, 2016
అఖిల్
అఖిల్
అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ నటించే రెండో సినిమా ఏమిటనే దానిపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తను నటించిన మొదటి చిత్రం పరాజయం పాలవడంతో, రెండో సినిమా విషయంలో తొందరపడడం లేదు. ఈసారి ఎలాగైనా విజయాన్ని సొంతం చేసుకోవాలని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా వంశీ పైడిపల్లి, కొరటాల శివ, కల్యాణ్ కృష్ణ వంటి దర్శకులతో చర్చలు జరిగాయి. అయితే, రకరకాల కారణాలతో ఇవి మెటీరియలైజ్ కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా హను రాఘవపూడి పేరు కొత్తగా వినిపిస్తోంది. 'అందాలరాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రాలతో విజయాలు సొంతం చేసుకున్న హను చెప్పిన కథ అఖిల్ కు, నాగార్జునకు బాగా నచ్చిందని, దాంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీంతో దర్శకుడు హను ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ చేస్తున్నాడట. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన వెలువడవచ్చు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)