ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

షరతులు పెడుతోన్న నివేదా థామస్

Tue, Jul 12, 2016
నివేదా థామస్
నివేదా థామస్
'జెంటిల్ మన్' చిత్రంలో నివేదా థామస్ ను చూడగానే కుర్రాళ్లంతా మనసు పారేసుకున్నారు. అలా గ్లామర్ తో యూత్ ను .. నటన పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆమె ఆకట్టుకుంది. అగ్రకథానాయకుల చిత్రాల్లో ఆమెకి ఛాన్స్ తగలడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చని చాలామంది అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆమెకి ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ తదుపరి సినిమాల్లో అవకాశం లభించిందట.

అయితే నివేదా థామస్ ఒక షరతు పెడుతోందనే టాక్ వినిపిస్తోంది. పాత్ర పరంగా గ్లామర్ గా కనిపించడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదుగానీ, స్కిన్ షో చేయడానికి మాత్రం తాను అంగీకరించనని నిర్మొహమాటంగా చెప్పేస్తోందని అంటున్నారు. సాధారణంగా కెరియర్ ఆరంభంలో ఇలాంటి షరతు పెట్టే కథానాయికలు చాలా తక్కువమంది వుంటారు. అందునా అగ్రహీరోల సినిమాలకి కూడా ఈ షరతు పెట్టే కథానాయికలు మరింత తక్కువగా వుంటారు. అలాంటివారి జాబితాలో నివేదా థామస్ చేరిందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)