ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీ మూవీలో రమ్యకృష్ణ ఖరారు

Tue, Jul 12, 2016
రమ్యకృష్ణ
రమ్యకృష్ణ
రజనీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'నరసింహ' సినిమాను ప్రేక్షకులు అంత తొందరగా మరిచిపోలేరు. ఈ సినిమా తరువాత ఈ జంట మళ్లీ తెరపై సందడి చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడీ అవకాశం వచ్చింది. రజనీకాంత్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదిస్తున్నట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎంపిక జరిగిపోయిందనీ, అగ్రిమెంట్ కూడా అయిందనేది తాజా సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ లేని కొన్ని సన్నివేశాలను 'తలకోన'లో చిత్రీకరిస్తున్నారు. రజనీకాంత్ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ ఆగస్టు షెడ్యూల్ లో ఉంటుంది. అదే నెలలో ఈ సినిమా షూటింగులో రమ్యకృష్ణ జాయిన్ కానుందని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)