ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రవిబాబు సినిమా టైటిల్ కి అదే సెంటిమెంట్!

Tue, Jul 12, 2016
రవిబాబు
రవిబాబు
విలక్షణమైన పాత్రలను పోషించే నటుడిగా .. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా రవిబాబుకి ఎంతో క్రేజ్ ఉంది. తాను దర్శకత్వం వహించే సినిమాలకి 'అ' అనే అక్షరంతో టైటిల్ మొదలయ్యేలా చూసుకోవడం ఆయన సెంటిమెంట్. అల్లరి .. అనసూయ .. అవును చిత్రాలు అలా వచ్చినవే.

ఇప్పుడు అదే సెంటిమెంట్ తో ఆయన తన తాజా చిత్రానికి 'అదుగో' అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే రవిబాబు, ఈసారి ఒక ప్రయోగానికి సిద్ధపడ్డాడు. పందిపిల్లల నేపథ్యంతో ముడిపడిన ఒక కథను ఆయన తెరకెక్కించాడు. ఇందుకోసం ఆయన ఖరీదైన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించడం విశేషం. ఈ సినిమాలో అభిషేక్ - నాభ ప్రధానమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)