ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభుదేవా తనని తానే గుర్తుపట్టలేకపోయాడట!

Tue, Jul 12, 2016
ప్రభుదేవా
ప్రభుదేవా
నటుడిగా కొంత గ్యాప్ తరువాత ఓ త్రిభాషా చిత్రంలో ప్రభుదేవా నటిస్తున్నాడు. తెలుగులో 'అభినేత్రి' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా, తమిళ .. హిందీ భాషల్లోను రూపొందుతోంది. ఇంతవరకూ ప్రభుదేవా ఏ సినిమాలో నటించినా తన కర్లింగ్ హెయిర్ తోనే కనిపించాడు. అయితే ఈసారి అందుకు భిన్నంగా కొత్త హెయిర్ కట్ తో ఈ సినిమాలో కనిపించనున్నట్టు ఆయన చెప్పాడు.

మొదటిసారి ఈ కొత్త హెయిర్ కట్ లో చూసుకున్నప్పుడు తనని తాను గుర్తుపట్టలేక పోయానని అన్నాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు మినహాయించి, మిగతా పాత్రల్లో ఆయా భాషలకి చెందిన నటీనటులు కనిపిస్తారని చెప్పాడు. అందువలన ఇది అనువాద చిత్రంగా అనిపించదని అన్నాడు. తొలిసారిగా హారర్ సినిమాలో నటిస్తుండటం చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)