ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' టీజర్ కి అదే ప్లస్ అయింది

Tue, Jul 12, 2016
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్
ఇప్పుడు ఎక్కడ చూసినా అంతా 'జనతా గ్యారేజ్' టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు. యూట్యూబ్ లో ఈ టీజర్ విడుదలైన 6 రోజుల్లో 4 మిలియన్లకి పైగా వ్యూస్ రావడం గురించి విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో 'కబాలి' తరువాత స్థానంలో ఈ సినిమా టీజర్ నిలిచిందని అంటున్నారు. 'జనతా గ్యారేజ్' టీజర్ కి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడానికి కారణం, ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు టచ్ లో వుండటమేననే టాక్ వినిపిస్తోంది.

ఒక అభిమాని తన పేవరేట్ హీరోను కలుసుకుంటే, ఆ విషయాన్ని తనకి తెలిసిన వాళ్లందరికీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా ఆ సినిమాకి సంబంధించిన సమాచారం కూడా జనంలోకి వెళుతుంది. ఈ సినిమా షూటింగ్ విరామ సమయాల్లో ఎన్టీఆర్ ఎంతోమంది అభిమానులను కలుసుకున్నాడు. ఈ సినిమా గురించిన విశేషాలను వాళ్లతో పంచుకున్నాడు. అలా అందరిలో ఈ సినిమాపట్ల ఆయన ఆసక్తిని కలిగించాడు. ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ టచ్ లో ఉండటం ఈ టీజర్ కి ప్లస్ పాయింట్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)