ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ప్రభాస్ కి ఆ కథ బాగా నచ్చేసిందట!

Tue, Jul 12, 2016
ప్రభాస్
ప్రభాస్
ఈవేళ ప్రభాస్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన 'బాహుబలి 2' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఆ తరువాత సుజీత్ దర్శకత్వంలో ఆయన చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఇక సుజీత్ తరువాత దర్శకుడు కె.కె.రాధాకృష్ణకి కూడా ప్రభాస్ మాట ఇచ్చినట్టుగా ఆ మధ్య వార్తలు షికారు చేశాయి.

ఇటీవల రాధాకృష్ణ ఒక కథను ప్రభాస్ కోసం రెడీ చేసుకుని వెళ్లి ఆయనకి వినిపించాడట. ఆ కథ ప్రభాస్ కి బాగా నచ్చేసిందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలోనే ఈ సినిమా చేద్దామని ఆయన ఉత్సాహాన్ని చూపించాడని చెబుతున్నారు. 'బాహుబలి 2' తరువాత, సుజీత్ సినిమాతో పాటుగా .. రాధాకృష్ణ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ప్రభాస్ వున్నాడని చెబుతున్నారు. ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ వారే నిర్మించనుండటం విశేషం.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)