ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ ఇంట్రడక్షన్ సాంగ్ రెడీ!

Mon, Jul 11, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనున్న సినిమా కోసం, ఆయన అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ కి రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఫస్టు షెడ్యూల్ ను మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణతో ఆరంభించాలని మురుగదాస్ ప్లాన్ చేసుకున్నాడు.

తమిళంలో ఈ పాటను రాసే బాధ్యతను మదన్ కార్కికి మురుగదాస్ అప్పగించాడట. ఆయన ఈ పాటను అద్భుతంగా రాశాడని అంటున్నారు. హ్యారిస్ జైరాజ్ కూడా అందుకు తగిన సంగీతాన్ని అందించాడని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పాటను తెలుగులో రాయించే పనిలో మురుగదాస్ వున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)