ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విలన్ తో తలపడుతోన్న బాలయ్య

Mon, Jul 11, 2016
బాలకృష్ణ
బాలకృష్ణ
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోరాట సన్నివేశాలను దర్శకుడు క్రిష్ అక్కడ ప్లాన్ చేశాడు. విలన్ జోన్స్ తో బాలకృష్ణ తలపడే సన్నివేశాలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. మరికొన్ని రోజుల పాటు అక్కడే యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కొనసాగనుందని చెబుతున్నారు. ఈ పోరాట దృశ్యాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ఈ షెడ్యూల్ తో ఈ సినిమా 40 శాతం షూటింగును పూర్తిచేసుకుంటుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరపనున్నారు. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తారు. భారీ తారాగణంతో .. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాపై, భారీ అంచనాలు వున్నాయి. బాలయ్య అభిమానులంతా ఈ సినిమా కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)