ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అజిత్ తో నటిస్తానన్న పవన్!

Mon, Jul 11, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
తెలుగులో పవన్ కల్యాణ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. తమిళనాట అదే స్థాయి క్రేజ్ వున్న కథానాయకుడిగా అజిత్ కనిపిస్తాడు. తమిళంలో ఆ మధ్య అజిత్ రెండు హిట్ మూవీస్ చేశాడు. ఆ సినిమాల తెలుగు రీమేక్ లో నటించాలనే ఆలోచనలో పవన్ ఉన్నాడనే వార్తలు ఇటీవల షికారు చేశాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తే బాగుంటుందనే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ఇదే విషయాన్ని లండన్ వెళ్లిన పవన్ దగ్గర ఒక అభిమాని ప్రస్తావించాడు. తాను .. అజిత్ కలిసి నటించే విషయం ఇంతవరకూ ఎక్కడా ప్రస్తావనకు రాలేదని పవన్ అన్నారు. తమతో మల్టీ స్టారర్ మూవీని ఎవరూ ప్లాన్ చేయలేదని చెప్పారు. భవిష్యత్తులో అలాంటి ఆలోచనతో ఎవరైనా దర్శక నిర్మాతలు వస్తే, అజిత్ తో కలిసి నటిస్తానని అన్నారు. ఇక ఆ సమయం కోసం ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఎదురుచూస్తూ ఉండటం ఖాయమని చెప్పొచ్చు
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)